
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దండేపల్లి మండలం గూడెం దగ్గర స్వాగతం పలికారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తర్వాత జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఈటల రాజేందర్ , వివేక్ వెంకటస్వామి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడారన్నారు నేతలు.