అసెంబ్లీకి కేసీఆర్ హాజరు

అసెంబ్లీకి కేసీఆర్ హాజరు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. 2024, జూలై 25వ తేదీన సభలో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో.. సభకు హాజరయ్యారు కేసీఆర్. ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి సైతం రాలేదు. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ లో ప్రత్యేకంగా ప్రమాణం చేశారు కేసీఆర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత కూడా కేసీఆర్ అసెంబ్లీ వైపు రాలేదు. 

ఈ క్రమంలోనే కేసీఆర్ సభకు ఎందుకు రావటం లేదు అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ సభలో టార్గెట్ చేసింది. ముఖం చెల్లక రావటం లేదని.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసినా కేసీఆర్ స్పందించటం లేదంటూ కౌంటర్ చేసింది. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజు.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయించుకుని.. సభకు వచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే అంశంపై కొన్ని రోజులుగా హాట్ డిస్కషన్ నడుస్తుంది. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు సభకు రావటం ఆసక్తిగా మారింది. 

Also Read :-Telangana Assembly Budget 2024-25

బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ ఒక్క రోజు మాత్రమే హాజరవుతారా లేక ఇక నుంచి రోజూ వస్తారా అనేది చర్చనీయాంశం అయ్యింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. దానిపై చర్చ ఉంటుంది. ఆ చర్చలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు హాజరయ్యి.. మాట్లాడతారా లేదా అనేది కూడా వెయిట్ అండ్ సీ..