అమెరికా లేదా సింగపూర్​: విదేశీ పర్యటనకు కేసీఆర్

అమెరికా లేదా సింగపూర్​: విదేశీ పర్యటనకు కేసీఆర్
  • డిప్లొమాటిక్​ పాస్​పోర్టు..సాధారణ పాస్​పోర్టుగా మార్పు

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ చీఫ్​ కేసీఆర్​కొన్నాళ్ల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తున్నది. ఇన్నాళ్లు ఫాంహౌస్​కే పరిమితమై.. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనని కేసీఆర్.. తాజాగా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. అయితే, తన మనుమరాలు అలేఖ్యకు అమె రికాలో సీటు రావడంతో అక్కడికి వెళ్లాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే, తన మను మడు హిమాన్షు వద్దకూ వెళ్లే అవకాశం ఉందని, ప్రస్తుతం హిమాన్షు సింగపూర్​లో ఉంటున్నారని చెప్తున్నారు. 

అమెరికాలో సీటు వచ్చి చదువుకుంటున్న క్రమంలో కేసీఆర్​పై బెంగతో ఆయన్ను చూసేం దుకు హిమాన్షు పదే పదే ఇండియాకు వచ్చారట. దీంతో కొంతకాలం క్రితం హిమాన్షును సింగపూర్​కు మార్పించారని, ఈ క్రమంలోనే కేసీఆర్..​హిమాన్షు వద్దకూ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అమెరికా  లేదంటే సింగపూర్​ ఏదైనా కేసీఆర్​ విదేశీ టూర్​ మాత్రం పక్కా అని అంటున్నారు.

విదేశీ పర్యటన నేపథ్యంలోనే పాస్​పోర్టు రెన్యువల్

విదేశీ పర్యటన నేపథ్యంలోనే కేసీఆర్​తన పాస్​పోర్టును రెన్యువల్​ చేయించుకున్నట్టు బీఆర్ఎస్​వర్గాలు చెప్తున్నాయి. బుధవారం ఆయన ఎర్రవల్లి ఫాంహౌస్​ నుంచి సికింద్రాబాద్​లోని రీజనల్​ పాస్​పోర్ట్​ ఆఫీసుకు వచ్చారు. అక్కడ ఆయన తన పాస్​పోర్టును రెన్యువల్​ చేయించుకున్నారు. వాస్తవానికి సీఎంగా ఉన్న కాలంలో కేసీఆర్​కు డిప్లొమాటిక్​ పాస్​పోర్టు ఉండేది. ఇప్పుడు ఆ పదవి లేకపోవడంతో డిప్లొమాటిక్​ పాస్​పోర్టును సాధారణ పాస్​పోర్టుగా మార్పించుకున్నారని చెప్తున్నారు. 

మామూలుగా డిప్లొమాటిక్​ పాస్​పోర్టు మెరూన్ కలర్​లో, సాధారణ పాస్​పోర్టు బ్లూ కలర్​లో ఉంటాయి. డిప్లొమాటిక్​ పాస్​పోర్టుపై విదేశాలకు వెళ్తే.. దానికి తగినట్టు ప్రొటోకాల్​ వర్తిస్తుంది. అయితే, ఇప్పుడు తాను సీఎం హోదాలో లేకపోవడంతో కేసీఆర్​ ఆ డిప్లొమాటిక్  పాస్​పోర్టును రీజనల్​పాస్​పోర్ట్​ ఆఫీసర్​కు సరెండర్​ చేశారని చెప్తున్నారు. సాధారణ పౌరుడిలాగానే విదేశాలకు వెళ్లేందుకు నార్మల్​ పాస్​పోర్టుకు మార్చుకున్నారని తెలిసింది.