మునుగోడులో ఓటమి తప్పదని కేసీఆర్ కు అర్థమైంది: డీకే అరుణ

ప్రధాని గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కారు

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావు ?

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని కేసీఆర్ కు అర్థమైందని, అందుకే విలేఖర్ల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ స్పందించారు. అసలు  కేసీఆర్ చెప్తున్న ఆ ముగ్గురు నిందితులకు బీజేపీకి ఏమి సంబంధమని ప్రశ్నించారు. వీడియో చేయడానికి చాలా కష్ట పడ్డాం అని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని.. కేసీఆర్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 

ముగ్గురు ఎమ్మెల్యేలను కొన్నది ఎవరు ?

నలుగురులో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచారని.. ఆ ముగ్గురు ఎమ్మెల్యే లను కొన్నది ఎవరు? అని డీకే అరుణ ప్రశ్నించారు.  దేశ ప్రధాన మంత్రి గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కాలేరని అన్నారు. కేసులపై భయంలేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతారని డీకే అరుణ జోస్యం చెప్పారు.