సిల్వర్‌‌ జూబ్లీ మీటింగ్‌‌ను సక్సెస్‌‌ చేయాలి : కేసీఆర్‌‌

సిల్వర్‌‌ జూబ్లీ మీటింగ్‌‌ను సక్సెస్‌‌ చేయాలి : కేసీఆర్‌‌
  • కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లా నేతలతో కేసీఆర్‌‌ మీటింగ్‌‌

సిద్దిపేట, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ సిల్వర్‌‌ జూబ్లీ సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌‌లో నిర్వహించనున్న బహిరంగ సభపై ఉమ్మడి కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లా నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌‌ గురువారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌‌ సభను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశానికి వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌‌కుమార్‌‌, జోగినపల్లి సంతోష్‌‌కుమార్‌‌, నాయకులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఆర్‌‌ఎస్‌‌.ప్రవీణ్‌‌కుమార్‌‌, ఎల్.రమణ, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌‌రెడ్డి, అనిల్‌‌ జాదవ్‌‌, కోవా లక్ష్మి, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, జోగు రామన్న, బాల్క సుమన్‌‌, వొడితెల సతీష్‌‌కుమార్‌‌, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగరరావు హాజరయ్యారు. అనంతరం రసమయి బాలకిషన్‌‌ రచించిన ‘బండెనక బండి కట్టి.. గులాబీల జెండా పట్టి’ పాటను కేసీఆర్‌‌ ఆవిష్కరించారు.