బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేద్దాం: కేసీఆర్

బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేద్దాం: కేసీఆర్
  • మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి: కేసీఆర్

సిద్దిపేట, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా నేతలకు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సూచించారు. సభ విజయవంతంలో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో కేసీఆర్ సమావేశమయ్యారు.

సభ నిర్వహణకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై సూచనలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.