
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5న పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని మొగ్దుంపూర్, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంతోపాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్ల పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు గంగుల తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.