
పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్మండలంలోని సుల్తాన్‌పూర్‌లో మంగళవారం సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్హాజరుకానున్నారు. సుల్తాన్పూర్సమీపంలో నేషనల్ హైవే పక్కన 42 ఎకరాల్లో సభ నిర్వహించనున్నారు.
జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్, సంగారె డ్డి, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, నర్సాపూర్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సభా ఏర్పాట్లను పరిశీలించారు.