హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ తోనే తెలంగాణ అభివృద్ది చెందిందని, ఈ అద్భుతాలను దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని, వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సికింద్రాబాద్ నామాల గుండులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని..స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నగరంలో చాలా పండుగలు గొప్పగా జరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో అనేక ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజలకు అద్భుతాలు అందించేందుకే బీఆర్ఎస్ ఏర్పాటు అయ్యిందని, వివిధ రాష్ట్రాల నుంచి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు.