ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌ది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. శనివారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని హరిహర కళాభవన్‌‌‌‌‌‌‌‌లో బీసీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, రీజినల్‌‌‌‌‌‌‌‌ కో ఆర్డినేటర్లు, బీసీ హాస్టల్‌‌‌‌‌‌‌‌ వార్డెన్లు, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు బ్యాంకు లింకేజీ లేకుండా త్వరలోనే లోన్లు అందిస్తామన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో ఉన్న వారిని సొంత పిల్లలుగా భావించి ప్రేమానురాగాలతో చదువు చెప్తే.. పది కాలాలు మనల్ని మనసులో పెట్టుకుంటారన్నారు. విద్య, పాలన, సంక్షేమ రంగాల్లో బీసీలకు కేసీఆర్ పెద్ద వాటా ఇచ్చారన్నారు.

తెలంగాణ వచ్చే నాటికి 19 గురుకులాలు ఉంటే వాటి సంఖ్య 310కి పెంచి 1,65,400 మందికి నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌దేనని చెప్పారు. హాస్టళ్లలో ఇంకో 57,783 మంది విద్యార్థులు ఉంటూ చదువుతున్నారని తెలిపారు. హాస్టళ్లలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌, బిల్డింగుల నిర్వహణ కోసం ఏటా ఒక్కో హాస్టల్‌‌‌‌‌‌‌‌కు రూ.50 వేలు ఇస్తున్నామని చెప్పారు. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు భోజనం కోసం పాత సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. వాటర్‌‌‌‌‌‌‌‌ హీటర్లు ఏర్పాటు చేశామని, డైట్‌‌‌‌‌‌‌‌ చార్జీలు పెంచుతున్నామని, కాస్మొటిక్‌‌‌‌‌‌‌‌, బెడ్‌‌‌‌‌‌‌‌ చార్జీలు సరిపడా ఇస్తున్నామని పేర్కొన్నారు. సమ్మర్‌‌‌‌‌‌‌‌ కల్చరల్‌‌‌‌‌‌‌‌ కార్నివాల్స్‌‌‌‌‌‌‌‌, రాక్‌‌‌‌‌‌‌‌ క్లైంబింగ్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ సమ్మిట్‌‌‌‌‌‌‌‌లతో విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

దసరా తర్వాత గురుకులాల విజిట్

దసరా తర్వాత గురుకులాలు, హాస్టళ్లను అధికారులతో కలిసి విజిట్‌‌‌‌‌‌‌‌ చేస్తానని మంత్రి గంగుల చెప్పారు. అన్ని గురుకులాలు, హాస్టళ్లలో హెల్త్‌‌‌‌‌‌‌‌ రికార్డులు కచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అనధికార వ్యక్తులు, ఇతరులు గురుకులాలు, హాస్టళ్లలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓవర్సీస్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ అధికంగా ఉందని, దానికనుగుణంగా సంఖ్య పెంచుతామని బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు.