బడ్జెట్ చూసి కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయింది

బడ్జెట్ చూసి కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయింది
  •  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి మాజీ సీఎం కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించారన్నారు. పదేండ్లు పాలించిన కేసీఆర్ కు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. 

శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఈ బడ్జెట్ భేష్ అని అంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ పార్టీ వీడుతారేమోననే భయంతో కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే కేసీఆర్ మంచి చేస్తే  భేష్ అనే దమ్ము, ధైర్యం తమకు ఉన్నాయని.. కానీ, ఆయనకు అంతటి పెద్ద మనసు లేదని విమర్శించారు. బడ్జెట్​పై కేసీఆర్​వి రాజకీయ విమర్శలేనని జగ్గారెడ్డి మండిపడ్డారు.