కేసీఆర్ సర్వే అసంపూర్ణం..కులగణనపై కమిటీ వేసింది కాంగ్రెస్.. సీఎం రేవంత్రెడ్డి

కేసీఆర్ సర్వే అసంపూర్ణం..కులగణనపై కమిటీ వేసింది కాంగ్రెస్.. సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్:కులగణనపై మా సర్వే పర్ఫెక్ట్.. అయినప్పటికీ కులగణనలో పాల్గొనని వారికోసం రెండోసారి కూడా సర్వే నిర్వహించాం..కొందరు పొద్దుపోని వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం.. బీఆర్ ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలపై ట్యాక్సులు వేయాలని పీఎం మోదీని కోరుతామని .. అలా అయినా అబద్ధాలు మాట్లాడకుండా ఉంటారని హస్యంగా స్పందించారు. 

మా సర్వేలు చేసింది టీచర్లు.. మీ సర్వేలు చేసింది ఎవరో వివరాలు ఇవ్వాలని సీఎం బీఆర్ ఎస్ నేతలు వివరాలు చెప్పగలరా అని అన్నారు. గద్దర్ లాంటి వారు వస్తే.. అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఎండలో నిల్చోబెట్టిన చరిత్ర బీఆర్ ఎస్ ది.. గద్దర్ అవార్డు ఇచ్చి గౌరవించిన చరిత్ర కాంగ్రెస్ ది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఏనాడు ఉద్యమకారుల పేరు ఉచ్చరించలేదు..మేము అలాంటి వారిని సత్కరించుకున్నామని అన్నారు. 

ALSO READ | డ్రగ్స్ కేసులో దొరికితే.. కరెంటు, నీళ్లు కట్: సీఎం రేవంత్

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారు.. ఆయన్ను కలవడంలో రాజకీయమేముంది? అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. కేంద్ర సహాయంతోనే రాష్ట్ర ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. అందుకే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం తప్పని సరి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.