సిద్దిపేట జిల్లా లైబ్రరీ చైర్మన్​గా కేడం లింగమూర్తి

సిద్దిపేట జిల్లా లైబ్రరీ చైర్మన్​గా కేడం లింగమూర్తి

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​కు చెందిన కేడం లింగమూర్తికి తగిన గౌరవం దక్కింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984లో కాంగ్రెస్ లో చేరిన ఆయన ఎన్ఎస్​యూఐ, యూత్​వింగ్​లో పనిచేశారు. 40 ఏండ్లుగా పార్టీ మారకుండా జెండా మోస్తున్నారు. ఏసీడీపీ మెంబర్​గా, ఏఎంసీ వైస్​చైర్మన్​గా పనిచేశారు.

హుస్నాబాద్​ మేజర్​ గ్రామపంచాయతీ సర్పంచ్​గా గ్రామ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు శిష్యుడిగా, ఇప్పటి మంత్రి పొన్నం ప్రభాకర్​ ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయనకు నమ్మకంగా ఉంటున్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న లింగమూర్తికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పదవి రావడంతో కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ శుభాకాంక్షలు తెలిపారు. నమ్మకాన్ని నిలబెడతా: లింగమూర్తి

పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నాకు జిలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పదవిని ఒక బాధ్యతగా భావించి గ్రంథాలయ సంస్థ ప్రతిష్టను ఇనుమడింపజేస్తాను. ఈ అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్​కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని నిలబెడతా.