అంతర్జాతీయ క్రికెట్ కు మరో భారత క్రికెటర్ తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. శనివారం (జూన్ 1) తన పుట్టిన రోజున దినేష్ కార్తీక్ తన క్రికెట్ కు గుడ్ బై చెప్పగా.. మరో రెండు రోజుల్లోనే టీమిండియా మాజీ బ్యాటర్ కేదార్ జాదవ్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. సోమవారం (జూన్ 3) మహారాష్ట్రకు చెందిన జాదవ్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచి.. తనను ప్రోత్సహించిన అభిమానులకు ఈ మాజీ క్రికెటర్ ధన్యవాదాలు తెలిపాడు.
కేదార్ జాదవ్ టీమిండియా ఎంట్రీ 2014లో నవంబర్ 16న శ్రీలంకపై జరిగింది. జూలై 17, 2015న జింబాబ్వేపై తన తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. మిడిల్ ఆర్డర్ లో ఎటాకింగ్ చేయడంతో పాటు బౌలింగ్ లో పార్ట్ టైం బౌలర్ గా రాణించాడు. మొత్తం 73 వన్డేల్లో 42.09 సగటుతో 1389 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ మ్యాజిక్ చేసి 27 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 విషయానికి వస్తే 9 మ్యాచ్ ల్లో 122 పరుగులు మాత్రమే చేశాడు.
2019 ప్రపంచ కప్ 15 మంది ప్రాబబుల్స్ లో జాదవ్ ఉన్నాడు. జాదవ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను 2020లో న్యూజిలాండ్ పై ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో భాగంగా 2013-14 రంజీ సీజన్ లో జాదవ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ అరంగేట్రం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున ఆడాడు. మొత్తం 93 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1196 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Kedar Jadhav announces retirement from all forms of cricket
— Cricbuzz (@cricbuzz) June 3, 2024
ODIs - M - 73, R - 1389, A - 42.09, SR - 101.60, W - 27 pic.twitter.com/ZxXQIvGmhL