కేదార్​నాథ్ ఆలయ తలుపులు మూసివేత

కేదార్​నాథ్ ఆలయ తలుపులు మూసివేత

డెహ్రాడూన్: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని బంద్ చేశారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక గుడి తలుపులను పూజారులు మూసివేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు18 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఆరు నెలల తర్వాతే ఆలయం తెరుచుకుంటుంది.

ఈ కాలంలో టెంపుల్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సమయంలో ఓంకారేశ్వర్ ఆలయంలో కేదార్​నాథుడిని దర్శించుకోవచ్చు. ఈ సీజన్ లో16.5 లక్షల మందికి పైగా భక్తులు  కేదార్ నాథ్ ఆలయాన్ని  దర్శించుకున్నారని బద్రినాథ్–కేదార్ నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) మీడియా ఇన్ చార్జ్ హరీశ్ గౌర్ తెలిపారు.