మూవీ లవర్స్కు కీడా కోలా టీమ్ బంపర్ ఆఫర్.. సగం ధరకే మల్టిఫ్లెక్స్ టికెట్స్

మూవీ లవర్స్కు కీడా కోలా టీమ్ బంపర్ ఆఫర్.. సగం ధరకే మల్టిఫ్లెక్స్ టికెట్స్

టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun bhascker) నటించి, తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కీడాకోలా(Keedaa cola). బ్రహ్మానందం, చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, జీవన్, రఘురామ్, విష్ణు, రవీంద్ర విజయ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ క్రైం, కామెడీ ఎంటటైనర్ నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. 

ఇదిలా ఉంటే.. తాజాగా కీడాకోలా టీమ్ మూవీ లవర్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా టికెట్స్ రూ. 112 కే పొందవచ్చని తెలిపారు. దీపావళి పండుగా సందర్బంగా.. నవంబర్8 నుండి నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అది కూడా కేవలం తెలంగాణ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే అందుబాటు లో ఉందనుందని. ఆడియన్స్ కు తమ సినిమా మరింత చేరువకావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఆడియన్స్ ఈ ఆఫర్ ను ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి మరి.