ప్రోటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం పెరగడం వల్లే కీర్తికి అనారోగ్యం: DMHO కళావతిబాయి

ప్రోటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం పెరగడం వల్లే  కీర్తికి అనారోగ్యం: DMHO కళావతిబాయి

ఖమ్మం, వెలుగు: దానవాయిగూడెం బీసీ బాలికల గురుకుల స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీభవాని కీర్తి అనారోగ్యానికి ప్రోటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం పెరగడమే కారణమని ఖమ్మం డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో కళావతిబాయి చెప్పారు. అందుకు సంబంధించిన ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోందన్నారు. మమత హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న కీర్తిని బుధవారం ఆమె పరామర్శించి, బాలిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి 29న హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలుక కరవడంతో కీర్తికి మూడు డోసులు యాంటీ రేబిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీటీ ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారన్నారు. తర్వాత ఏప్రిల్ 1న స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తల్లి స్థానిక భవానీ హోమియో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మందులు ఇప్పించారని, అదే సమయంలో కీర్తికి జుట్టు ఊడిపోవటంతో స్థానిక విజయ స్కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స తీసుకున్నారని తెలిపారు. కొన్ని రోజులుగా హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరిగా ఉండకుండా ఇంటి దగ్గర ఉంటూ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటోందన్నారు. 

డిసెంబర్ 11న హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వెళ్లి ఎడమ కాలు నొప్పితో మమత హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిందని, తర్వాతి రోజు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయగా అన్నీ నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చాయన్నారు. కీర్తికి నెల రోజుల కింద ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో మందులు వాడారని, దీనికి సంబంధించి వెన్నెముకలో నీటిని తీసి పరీక్షించగా ప్రోటీన్ శాతం పెరిగినట్లు తేలిందని, దీనికి సంబంధించి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోందన్నారు. విద్యార్థిని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు.