పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కీర్తి సురేష్.. పెళ్లి తర్వాత రూట్ మార్చేసిందిగా..

 పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కీర్తి సురేష్.. పెళ్లి తర్వాత రూట్ మార్చేసిందిగా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది తన చిరకాల ప్రేమికుడు ఆంథోని తటిల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటన పరంగా గేర్ మార్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కేవలం హీరోయిన్ గా మాత్రమేకాకుండా తన పాత్రకి ప్రాధాన్యం ఉన్న అవకాశం వస్తే వెబ్ సీరిస్ లో కూడా నటించేందుకు ఒకే చెబుతోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో ప్రముఖ డైరెక్టర్ ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న "అక్క" అనే వెబ్ సీరీస్ లో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సీరీస్ ని హిందీ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. 

ఈ వెబ్ సీరిస్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ సోమవారం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో కీర్తి సురేష్, మరో ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే గ్యాంగ్‌స్టర్ రాణుల పాత్రలో నటించారు. ఇందులో కీర్తి సురేష్ రెబల్ లుక్ లో కనిపించగా రాధికా ఆప్టే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. 1980 సంవత్సరకాలంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పేట్రియాజం జోనర్ లో ఈ సినిమా ని తెరకెక్కించారు. ఓవరాల్ గా చూస్తే విజువల్స్, బీజియం, ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దీంతో అక్క వెబ్ సీరీస్ పై ఆసక్తి నెలకొంది. అయితే ఈ వెబ్ సీరీస్ త్వరలోనే ప్రముఖ ఓటిటి అయిన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

ALSO READ | వాలైంటెన్స్ డే రోజున ఆ ఓటిటిలో నాగచైతన్య పెళ్లి వీడియో రిలీజ్ కానుందా..?

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన బేబీ జాన్ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, కన్నివీడి అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.