టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల ప్రేమికుడు, బిజినెస్ మెన్ ఆంథోని తట్టిల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 12న హిందూ సాంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి టాలీవుడ్, కోలీవుడ్, హిందీ సినీ పరిశ్రమలనుంచి అతిథులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈరోజు (ఆదివారం 15) క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతిలో మరోసారి వివాహం చేసుకున్నారు.
ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకి తెలిపింది. ఐతే ఆంథోనీ తట్టిల్ క్రిస్టియన్ రిలీజియన్ కి చెందిన వ్యక్తి. ఇక కీర్తి సురేష్ హిందువు. దీంతో ఇరువురి సంప్రదాయ పద్దతుల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. దీంతో అభిమానులు, బంధువులు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా కీరేహి సురేష్ దంపతులకి పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ALSO READ | రామ్ చరణ్ సినిమలో విలన్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ స్టార్ హీరో...
ఈ విషయం ఇలా ఉండగా కీర్తి సురేష్ ప్రస్తుతం హిందీలో ప్రముఖ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న బేబీ జాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి తమిళ్ ప్రముఖ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీంతో డిసెంబర్ 25 న ప్యాన్ ఇండియా భాషాల్లో రిలీజ్ కాబోతోంది.
ఇక ఆంథోని తట్టిల్ దుబాయ్ లో వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే పెళ్లయిన తర్వాత కీర్తి సురేష్ సినిమాల్లో కంటిన్యూ అవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
#ForTheLoveOfNyke 🤍 pic.twitter.com/DWOoqarM43
— Keerthy Suresh (@KeerthyOfficial) December 15, 2024