Keerthy Suresh: రణబీర్ కపూర్తో కీర్తి సురేష్.. యానిమల్ రేంజ్లో రొమాంటిక్ డ్రామా స్టోరీ!

Keerthy Suresh: రణబీర్ కపూర్తో కీర్తి సురేష్.. యానిమల్ రేంజ్లో రొమాంటిక్ డ్రామా స్టోరీ!

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో తన జెండా పాతడానికి తెగ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోతో మూవీ సెట్ అయినట్లు సినీ వర్గాల సమాచారం. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్తో కీర్తి జోడీ కట్టనున్నట్లు టాక్. ఫ్యాన్స్లో మంచి క్రేజ్ ఉన్న వీరిద్దరి కోసం ప్రత్యేకంగా కథ రెడీ అవుతోందట. అందుకోసం రణబీర్ యానిమల్ రేంజ్లో అదిరిపోయే రొమాంటిక్ డ్రామా స్టోరీని మేకర్స్ తీర్చిదిద్దుతున్నట్లు టాక్ ఊపందుకుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

ALSO READ | Sikandar Box Office: సల్మాన్ ఖాన్కు కలిసిరాని ఈద్.. సికందర్ రెండ్రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్

అయితే, ఇటీవలే కీర్తి సురేశ్ బేబీ జాన్ చిత్రంలో కనిపించింది. ఇది 2024లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. ఇది తమిళ చిత్రం థెరికి రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది.

బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న కీర్తి ఆశలు బేబీ జాన్తో ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా బాలీవుడ్లో హిట్ కొట్టాలనే  సెకండ్ మూవీని చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కీర్తి ఎలాంటి మూవీతో రానుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

ప్రస్తుతం కీర్తి సురేశ్.. తెలుగులో 'అక్క', 'రివాల్వర్ రీటా' లాంటి వైవిధ్యమైన కథలతో బిజీగా గడుపుతోంది. 2024 డిసెంబర్ నెలలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తట్టిల్ని గోవాలో పెళ్లి చేసుకుంది.