Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్.. కాబోయే భర్త ఇతనే అంట..!

Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్.. కాబోయే భర్త ఇతనే అంట..!

Keerthy suresh: పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన తమిళ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కీర్తీ సురేష్ కోలీవుడ్ కి చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, బిజినెస్ మెన్ ఆంథోనీ తటిల్‌ ని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

కీర్తి సురేష్, ఆంథోనీ చదువుకునే రోజులనుంచి ప్రేమలో ఉన్నారట.  దీంతో ఇటీవలే ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంధువులు, స్నేహితుల సమక్షంలో డిసెంబర్ 11న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఈ ఇద్దరూ ఒక్కటి కాబోతోన్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ ఈ పెళ్లి విషయంపై ఇప్పటివరకూ ఇటు కీర్తి సురేష్ గానీ, అటు ఆంథోని కుటంబ సభ్యులుగానీ స్పందించలేదు. దీంతో ఈ వార్తలో నిజమెంతుందనేది తెలియాల్సి ఉంది. 

ALSO READ | విజయ్ దేవరకొండ VD12 లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. ?

అయితే ఇలాగే గతంలో కీర్తి సురేష్ తమిళ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతోందని పలు గాసిప్స్, రూమర్స్  వినిపించాయి. కానీ కీర్తి సురేష్ మాత్రం అనిరుధ్ తో పెళ్లి వార్తలపై స్పందిస్తూ కొట్టిపారేసింది. అలాగే అనిరుధ్ తనకి మంచి స్నేహితుడని తమ మధ్య ఎలాంటి ప్రేమా, గీమా లేదని క్లారిటీ ఇచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి కీర్తి సురేష్ ఈ మధ్య వరుస సినిమాలలో హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్, దసరా, కల్కి 2898AD(బుజ్జి వాయిస్) సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో ప్రముఖ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న బేబి జాన్ సినిమలో హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.