ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌‌‌‌లో కీర్తి సురేష్.!

ఇటీవల కాలంలో సినీ ఇండ స్ట్రీలో బయోపిక్‌‌‌‌లకు మంచి క్రేజ్‌‌‌‌ ఏర్పడింది. పొలిటికల్, స్పోర్ట్స్ పర్సన్స్‌‌‌‌తో పాటు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల జీవితం ఆధారంగా ఇప్పటికే కొన్ని బయోపిక్స్ స్ర్కీన్‌‌‌‌పై కనిపించాయి. తాజాగా  ప్రముఖ గాయని  ఎం.ఎస్ సుబ్బలక్ష్మి  జీవిత కథ సినిమాగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శక నిర్మాతలు ఎవరన్నది  తెలియలేదు కానీ..  సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. 

ఈ లిస్టులో మొదటిగా వినిపిస్తున్న పేరు కీర్తి సురేష్. ఇప్పటికే ఆమె ‘మహానటి’లో సావిత్రిగా మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో సుబ్బలక్ష్మి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు కీర్తి అయితేనే పర్ఫెక్ట్ చాయిస్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే త్రిష, నయనతార, రష్మిక పేర్లు కూడా ఈ బయోపిక్‌‌‌‌లో చేయనున్నారనే వార్తలు  వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌‌‌‌.. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్ర్కిప్ట్ ఫైనల్ చేసే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. 

సుబ్బలక్ష్మి జీవితం గురించి ఎంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మదురైలో  మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె  ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలాంటి కాన్సెప్ట్‌‌‌‌తో రాబోతున్న సినిమాపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. మరి ఆ లెజెండరీ సింగర్ బయోపిక్‌‌‌‌లో నటించే చాన్స్ ఫైనల్‌‌‌‌గా ఎవరు అందుకుంటారో చూడాలి.