Allu Arjun, Keerthy Suresh: సూస్కుందాం.. పుష్ప 2తో పోటీకి దిగుతున్న కీర్తి సురేష్

పుష్ప2(Pushpa 2).. ప్రస్తుతం ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇటీవల విడుదలైన సాంగ్స్, టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. దాంతో.. ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా కూడా వచ్చే సాహసం చేయడం లేదు. కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లో అదే పరిస్థితి. 

కానీ, ఒక హీరోయిన్ మాత్రం పుష్పరాజ్ కు పోటీగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్. ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ర‌ఘు తాతా. దర్శకుడు సుమ‌న్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజ‌ర్‌ సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. 

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే తేదీకి పాన్ ఇండియా లెవల్లో పుష్పరాజ్ మ్యానియా మొదలుకానుంది. మరి ఆ పరిస్థితుల్లో రఘు తాత సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే అవకాశం ఉంటుందా అనేది ట్రేడ్ వర్గాల మాట. అయితే రఘు తాత అనేది కంటెంట్ ఓరియెంటెడ్ గా వస్తున్న సినిమా. అందుకే కథను నమ్ముకొని వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందంటున్నారు మేకర్స్. మరి ఎలా చూసుకున్న పుష్ప 2కి పోటీగానే రావడం అంటే సాహసమనే చెప్పాలి.