
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా తన ఇన్స్టా ఖాతాలో కొలంబోలో దిగిన ఫొటోలను కీర్తి పోస్ట్ చేసింది.
ఇందులో ఆమె బంగారు ఎంబ్రాయిడరీ ముదురు ఆకుపచ్చ రంగు డైస్ వేసుకుంది. స్టైలిష్ బ్లేజర్, మడతల డైప్ ఉన్నాయి. ఆమె జుట్టును సొగసైన పోనీటైల్లో కట్టుకుంది. "ఆయుబోవాన్ కొలంబో, మీరు చాలా వైబ్' అని క్యాపన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో కీర్తి సురేష్ పేరు నెట్టింట్లో ట్రెండింగ్గా మారింది.
ఇకపోతే, కీర్తి సురేశ్ 'పైలట్' సినిమాతో 2000 సంవత్సరంలో బాలనటిగా ఇండస్ట్రీలోకి ఇచ్చింది. 2013లో గీతాంజలి సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాత వాసి సినిమాల్లో యాక్ట్ చేసింది. దాంతో ఆమె నటించిన మహానటి సినిమా తన కెరీర్ను మలుపు తిప్పింది. సావిత్రి బయోపిక్గా వచ్చిన మహానటి సినిమాలో ఆమె అద్భుతంగా నటించి పలు అవార్డులు సొంతం చేసుకుంది.
ALSO READ | Pushpa 3: పుష్ప 3పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అప్పుడే పుష్పరాజ్ వచ్చేది.. నిర్మాత కామెంట్లు వైరల్
ఇటీవలే బేబీ జాన్ చిత్రంలో కనిపించింది. ఇది 2024లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. ఇది తమిళ చిత్రం థెరికి రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. 2024 డిసెంబర్ నెలలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తట్టిల్ని గోవాలో పెళ్లి చేసుకుంది.