KeerthySuresh: కీర్తిసురేష్ పెళ్ళిలో దళపతి విజయ్.. ప్రేమతో ఐకాన్ స్టార్ అంటూ ఫోటోలు షేర్

KeerthySuresh: కీర్తిసురేష్ పెళ్ళిలో దళపతి విజయ్.. ప్రేమతో ఐకాన్ స్టార్ అంటూ ఫోటోలు షేర్

గోవాలో (Dec 12న) కీర్తిసురేష్ (Keerthy Suresh), తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కీర్తిసురేష్ వివాహానికి తెలుగు, తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇందులో భాగంగా హీరో దళపతి విజయ్(Thalapathy Vijay).. కీర్తి వివాహానికి హాజరయ్యి నూతన వధూవరులకు విషెష్ తెలిపారు. తాజాగా విజయ్కి సంబంధించిన ఫొటోస్ను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు విజయ్ ఫొటోస్కి క్యూట్ ట్యాగ్ని జోడించింది. " మా కలల వివాహానికి.. మా ఐకాన్ స్టార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు" అంటూ ప్రేమతో.. మీ నంబీ అంటూ పోస్ట్ చేసింది. 

విజయ్ అంటే కీర్తి సురేష్కి విపరీతమైన అభిమానం. వీరిద్దరూ కలిసి నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఏజెంట్ భైరవ, సర్కార్ సినిమాలతో ఈ జోడి మెప్పించారు. అంతేకాకుండా విజయ్ బర్త్డే స్పెషల్గా కుట్టి సాంగ్ను తనదైన శైలిలో గిఫ్ట్గా ఇచ్చింది కీర్తి. ఈ బంధంతోనే కీర్తి సురేష్ వివాహానికి దళపతి విజయ్ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.

ఇంతకుముందు కీర్తి తన సోషల్ మీడియాలో పెళ్ళికి వచ్చిన సినిమా వాళ్ళ ఫొటోస్ షేర్ చేసింది. అందులో డైరెక్టర్ అట్లీ, అతని భార్య ప్రియ మరియు హీరోయిన్స్ త్రిష కృష్ణన్, కళ్యాణి ప్రియదర్శన్‌ లతో ఉన్న ఫోటోలు పంచుకుంది. అలాగే వీరితో పాటు తలపతి విజయ్‌లతో పాటు, తెలుగు హీరో నాని మరియు అతని భార్య అంజనా గోవాలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌ను వెళ్లారు.