
డిఫరెంట్ స్ర్కిప్ట్‌లతో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటోంది కీర్తి సురేష్. గతేడాది తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న ఆమె.. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇస్తుందనుకున్నారంతా. కానీ అలాంటిదేమి జరగడం లేదు. కంటెంట్ నచ్చితే సినిమాలు చేయడానికి రెడీ అంటోంది.
ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది కీర్తి. తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నితిన్ హీరోగా ‘బలగం’ఫేమ్ వేణు రూపొందించనున్న ‘ఎల్లమ్మ’చిత్రంలో కీర్తి సురేష్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కథను వినిపించగా, హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడంతో ఆమె సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
గతంలో ‘రంగ్‌దే’చిత్రంతో నితిన్‌కు జంటగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రం షూటింగ్‌ను మే నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి సాయి పల్లవి ఇందులో నటించనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే తను ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండడంతో మరో హీరోయిన్ వేటలో పడ్డారు మేకర్స్. ఈ క్రమంలో కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. మరి కీర్తితోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌కు వెళుతుందేమో చూడాలి!