శివ భక్తులకు అలర్ట్.. కీసర బ్రహ్మోత్సవాలు షురూ

శివ భక్తులకు అలర్ట్.. కీసర బ్రహ్మోత్సవాలు షురూ

కీసర, వెలుగు: కీసరగుట్టలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన మండపంలో నిర్వహించిన గణపతి పూజలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ట్రస్ట్​బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 

అలాగే గుట్టలో చేసిన ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు. సివిల్, ట్రాఫిక్​ పోలీస్ ​సిబ్బంది, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.