కీసర బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 92 లక్షలు

కీసర బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 92 లక్షలు

కీసర, వెలుగు: కీసర గుట్టలో నిర్వహించిన మహాశివరాత్రి  స్వామివారి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానానికి రూ. 92,49,961 ఆదాయం వచ్చినట్టు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ తెలిపారు. ప్రసాదాలు, వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ. 63,51,060 ఆదాయం లభించగా, హుండీ లెక్కింపులో రూ. 28,98,901 వచ్చినట్లు తెలిపారు. మహా మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.  గతేడాది  కంటే ఈసారి సుమారు రూ. 14,70,436 అధికంగా సమకూరిందని వెల్లడించారు.