మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర గుట్టకు వెళ్లే రోడ్డు మార్గంలో బ్లాస్టింగ్ నిర్వహించారు. దీంతో పక్కనే ఉన్న లేమాన్ లిఫ్ దాబా దగ్గర ఉన్న వ్యక్తిపై రాయి పడింది. దానివల్ల ఆ వ్యక్తి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యక్ష సాక్షి..
కీసర గుట్టకు వెళ్లే దారిలో కొన్ని రోజులుగా మైనింగ్ జరుగుతుంది. ఈరోజు(సెప్టెంబర్ 10) ఉదయం బ్లాస్టింగ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాళ్లు పేలడంతో తన పక్కన ఉన్న కేశవ అనే వ్యక్తిపై ఓ రాయి వచ్చి పడిందని ప్రత్యేక్ష సాక్షి రమేష్ తెలిపాడు. ఆ రాయి కేశవ తలపై పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. క్షతగాత్రున్ని స్థానిక ఆసుత్రికి తరలించామని తెలిపాడు. మైనింగ్ వల్ల చుట్టు పక్కన ప్రాంతాల వారికి ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి మైనింగ్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.