నోరు తెరవని కీసర ఎమ్మార్వో నాగరాజు

ముగిసిన మాజీ తహసీల్దార్ మూడురోజుల కస్టడీ
విచారణకు ఆయన సహకరించలేదన్న ఏసీబీ
ఓ ఎంపీ ప్రమేయం ఉన్నట్లు డౌట్

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర మండలం మాజీ తహసీల్దార్ నాగరాజ్ ఏసీబీ విచారణకు సహకరించలేదంట. 3 రోజుల కస్టడీలో ఆయన నుంచి పెద్దగా వివరాలేమీ తెలుసుకోలేదని తెలిసింది. ల్యాండ్ సెటిల్ మెంట్ ఇష్యూలో లంచం తీసుకుంటూ దొరికిన నాగరాజు సహా నిందితులు వీఆర్‌‌ఏ సాయిరాజ్‌, రియల్టర్స్‌ ‌శ్రీనాథ్‌, అంజిరెడ్డిలను కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ఏసీబీ విచారించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వీరి కస్టడీ ముగియటంతో ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. స్పెషల్ జడ్జి ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు ఎన్ని ప్రశ్నలు అడిగినా నాగరాజ్ నోరు తెరవలేదని అధికారులు చెప్పారు. బ్యాంక్‌ లాకర్స్‌‌ లేవని…2011లో శామీర్‌‌‌‌పేట్‌‌ ట్రాప్‌‌ కేసులో సీజ్‌ చేసిన లాకర్‌‌‌‌ను వినియోగించటం లేదని మాత్రమే చెప్పినట్లు సమాచారం. ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ. 36 లక్షల క్యాష్‌‌ కి సంబంధించిన లెక్కలూ అధికారులు తెలుసుకోలేకపోయారు. మిగతా నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టారు. నాగరాజుకు సహకరించిన వీఆర్‌‌‌‌ఏ సాయిరాజ్‌ మాత్రం లంచం డబ్బుల కోసం బ్యాగ్‌‌ కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు ఏసీబీ
విచారణలో వెల్లడించాడు.

సత్య డెవలపర్స్ దే ఆ డబ్బు
లంచం కోసం తీసుకొచ్చిన రూ. 1.10 కోట్ల డబ్బు సత్య డెవలపర్స్ దేనని రియల్టర్ శ్రీనాథ్ ఏసీబీ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన ఇంట్లోదొరికిన గుండ్లపోచంపల్లి ల్యాండ్‌‌ డాక్యుమెంట్స్‌‌ ఆర్టీఐ నుంచి తీసుకున్నట్లు, ఎంపీ లెటర్ హెడ్ గ్రామ అభివృద్ధి పనులకు చెందిందని అంజిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఐతే ఈ వ్యవహారంలో ఓ ఎంపీ పాత్ర ఉందని ఏసీబీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. కీసర రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ‌‌‌శశికళ, సీనియర్ అసిస్టెంట్‌ ‌శ్రీపాల్‌‌నూ ఏసీబీ విచారించింది. మూడు నెలలుగా కీసర మండల ఆఫీస్‌‌కి వచ్చిన మ్యూటేషన్‌ అప్లికేషన్స్‌.. ‌అందులో అప్రూవల్‌ ‌ఇచ్చిన ల్యాండ్స్‌ ‌వివరాలు తెలుసుకున్నారు.

For More News..

లంచం కేసు.. లైట్ బాస్!

కాళేశ్వరం నీళ్లెక్కడ?