మేడ్చల్ జిల్లా : తాళం వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్న అంతరాష్ర్ట ముఠాను కటకటాల్లోకి నెట్టారు కీసర పోలీసులు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని.. విచారించగా అసలు విషయం బయటపడింది.ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఐదుగురు నిందితులు.. రాత్రి సమయాల్లో చోరీలు చేస్తుంటారని విచారణలో తేలింది. వెంటనే ఐదుగురు నిందితులైన హాసిన్, రాంభరోస్, సమీన్, షకీల్, రవీంద్రపాల్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 15.6 తులాల బంగారు ఆభరణాలు, 29.4 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.