భక్తులకు అలర్ట్.. 24 నుంచి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు

భక్తులకు అలర్ట్.. 24  నుంచి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు

కీసర, వెలుగు: ఈ నెల 24 నుంచి మార్చి 1 వరకు కీసర గుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా అడిషనల్​కలెక్టర్​విజయేందర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం ఆలయ చైర్మన్ నారాయణశర్మ, ఈఓ సుధాకర్ రెడ్డి, అధికారులు, ఆలయ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనాలకు సంబంధించిన వెబ్​సైట్‎ను ప్రారంభించారు. 

అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మహాశివరాత్రితోపాటు తర్వాత రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, క్యూలైన్లను పెంచాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఆర్టీసీ, ఫైర్, విద్యుత్​శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.