మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిత సుధాకర్ హాస్పటిల్ నర్స్ కావ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, గోళ్లగూడెం గ్రామానికి చెందిన కావ్య 8 నెలలుగా సరిత సుధాకర్ ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తుంది.అకస్మాత్తుగా కావ్యకు జ్వరం రావడంతో డాక్టర్ సుధాకర్ ఆమెను ఇంటికి పంపారు. ఆ తరువాత రెండు రోజులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కావ్య మృతి చెందింది. కీసర పోలీస్ స్టేషన్ లో కావ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో .. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
ALSO READ | రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు