కీసరగుట్ట కిటకిట..పోటెత్తిన భక్తులు..

కీసరగుట్ట కిటకిట..పోటెత్తిన భక్తులు..

కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది.  కీసరగుట్ట ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు.  శివయ్యకు అభిషేకం చేస్తూ.. ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ ప్రాంగణం హరహరమహాదేవ శంభో శంకర అంటూ మారు మ్రోగింది.  

Also Read :- అర్జునుడు కూడా నాగదేవతకు పాలుపోశాడు

భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు.  దేవాలయ అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు.భక్తుల సౌకర్యార్దం లడ్డు.. పులిహార ప్రసాదాలను పంపిణిచేశారు.  స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పోలీసులు మూడు  చెక్​ పోస్టులు ఏర్పాటు చేశారు.