రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ దక్కని ఊరట

రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ దక్కని ఊరట

ఢిల్లీ : ఢిల్లీ సీఎం,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ ను కొనసాగించాలని.. వైద్య పరీక్షల కోసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు వెలువరించనున్న తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు కోర్టులో లొంగిపోనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టైన విషయం తెలిసిందే. కాగా సుప్రీం కోర్టు ఆయనకు 21 రోజుల బెయిల్ మంజూరు చేసింది. రేపటితో అది ముగియనుంది.