
- 19 దాకా కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మెడికల్ టెస్టులు చేయించుకునేందుకు ఏడు రోజులపాటు బెయిల్ కోసం కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దానిపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం తన తీర్పును వెల్లడించింది. ఆయన పిటిషన్ ను తిరస్కరించడంతోపాటు జూన్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
కేజ్రీవాల్ ట్రీట్మెంట్ అంశాన్ని దగ్గరుండి చూసుకోవాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ కోరగా.. కోర్టు షరతులతో మంజూరు చేసింది.