డోస్ పెంచిన రాహుల్ గాంధీ.. ఆప్, బీజేపీ, ఆర్ఎస్ఎస్‎పై తీవ్ర విమర్శలు

డోస్ పెంచిన రాహుల్ గాంధీ.. ఆప్, బీజేపీ, ఆర్ఎస్ఎస్‎పై తీవ్ర విమర్శలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల డోస్ పెంచారు. మంగళవారం (జనవరి 28) పట్‌పర్‌గంజ్‎లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. మీడియా, ఆప్, బీజేపీ, ఆర్ఎస్ఎస్‎లపై విరుచుపడ్డారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన మీడియా.. కాలుష్యం, ద్రవ్యోల్బణం, మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోవడం లేదని.. మీడియా దృష్టి మొత్తం అంబానీ కొడుకు పెళ్లి, మోడీ జీ, అదానీ ఎయిర్‌పోర్ట్‌లను చూపించడంలో బిజీగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.

సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ మాత్రం మీడియా పట్టించుకోవడం లేదని రాహుల్ అన్నారు. ఇక, బీజేపీ, ఆర్ఎస్ఎస్ విజభన రాజకీయాలు ప్రోత్సహిస్తోందని.. మతాల మధ్య చిచ్చు పెట్టి విధ్వేషం వ్యాప్తి చేస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలోని భయం, ద్వేషంతో నిండిన దేశం మాకు వద్దని.. మనకు ప్రేమతో నిండిన దేశం కావాలని పేర్కొన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ పైన రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కు పెట్టారు. అవినీతి లేకుండా స్వచ్ఛమైన పాలన అందిస్తామని గద్దెనెక్కిన కేజ్రీవాల్.. ఆ వాగ్ధానం నేరవేర్చడంలో పూర్తి విఫలమయ్యారన్నారు.

ALSO READ | శవపేటిక మీద కూడా భార్య టార్చర్ వల్లే చనిపోయాడని రాశారు..!

ప్రజలను, పాలనను విస్మరించి.. విలాసవంతమైన శీష్ మహాల్ నిర్మించుకున్నాడని.. ఇది గాజు ప్యాలెస్ కంటే తక్కువేమి కాదని కేజ్రీవాల్‎ను టార్గెట్ చేశారు. అవినీతి లేని రాజకీయాలు చేస్తామని వచ్చిన ఆప్ పాలనలో అతిపెద్ద మద్యం కుంభకోణం వెలుగు చూసిందని ఇరకాటంలో కేజ్రీవాల్‎ను విమర్శించారు రాహుల్. రాహుల్ విమర్శలతో ఢిల్లీ పొలిటికల్స్ సర్కిల్స్ హీటెక్కాయి. మరీ బీజేపీ, ఆప్ రాహుల్ విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇస్తారా చూడాలి.