మనోహర్ పారికర్ కుమారుడికి కేజ్రీవాల్ ఆహ్వానం

దివంగత గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌‌ను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆహ్వానం పలికారు. వచ్చే నెలలో జరగబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటికే గోవాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఉత్పల్ పారికర్‌‌ను పక్కన పెట్టేయడంతో కేజ్రీవాల్ పై ప్రతిపాదనతో ముందుకొచ్చారు. బీజేపీ వాడుకుని వదిలేసిందని, తమ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ట్వీట్ చేశారు.

‘‘బీజేపీ తన యూజ్ అండ్ త్రో (వాడుకుని వదిలేసే) పాలసీని పారికర్ కుటుంబంపైనా ప్రయోగించడంపై గోవా ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు మనోహర్ పారికర్ అంటే చాలా గౌరవం. ఉత్పల్‌జీ మీకు ఇదే నా స్వాగతం. వచ్చే ఆప్‌లో చేరండి. ఈ ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేయండి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారు

భారత బాలుడ్ని కిడ్నాప్ చేసిన చైనా

ఢిల్లీ అల్లర్ల ప్రధాన నిందితుడికి శిక్ష ఖరారు