న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పూజారి గ్రంథి సమ్మాన్ యోజన స్కీమ్ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి కాశ్మీరీ గేట్ వద్ద మార్ఘట్ వాలే బాబా మందిరాన్ని సందర్శించుకున్నారు. అనంతరం కొత్త స్కీమ్ రిజిస్ట్రేషన్ ను షురూ చేశారు.
ఈ పథకం కింద ఆలయ మహంత్ పేరును స్వయంగా ఆయన రిజిస్టర్ చేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే గుడి పూజారులు, గురుద్వారాల గ్రంథిలకు నెలకు రూ.18 వేలను గౌరవ వేతనంగా చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ కేజ్రీవాల్ ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.