న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించిన రెండు రైలు ప్రాజెక్టు లు ఢిల్లీ మౌలిక వసతులకు మైలురాళ్లని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవి కేంద్రం, ఢిల్లీ సర్కారు జాయింట్ వెంచర్స్ అని తెలిపారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీ–మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌ను ప్రారంభించారు. అలాగే, ఢిల్లీ మెట్రో ఫేస్ 4లోని జనక్‌పురి వెస్ట్ క్రిష్ణ పార్క్ ఎక్స్టెన్షన్ సెక్షన్‌ను ఓపెన్ చేశారు.
వీటిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఆప్ కేవలం కేంద్రంతో పోరాటానికే సమయాన్ని వృథా చేస్తున్నదని అనేవాళ్లకు ఈ ప్రారంభోత్సవాలే గట్టి సమాధానాలు అని మోదీని పరోక్షంగా విమర్శించారు. ఆప్లీడర్లను జైళ్లో పెట్టి వేధింపులకు గురిచేసినా.. పాలనపైనే దృష్టిసారించారని తెలిపారు.