![కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ: ఎలక్షన్ రిజల్ట్ కు ముందే హైడ్రామా..](https://static.v6velugu.com/uploads/2025/02/kejriwal-sanjay-singh-to-be-questioned-by-acb-over-aaps-15-crore-horse-trading-allegations_bQp9zIoLmy.jpg)
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఢిల్లీలో హైడ్రామా మొదలైంది.. ఆప్ పార్టీ నేతల వ్యాఖ్యలపై మెరుపు వేగంతో స్పందించింది ఏసీబీ. ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తో పాటు ఇతర నేతల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. ఆప్ ఎమ్మెల్యేలకు లంచం ఆఫర్ చేశారంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జెట్ స్పీడ్‌లో రియాక్ట్ అయ్యారు. ఆప్ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు ఆప్ పార్టీ నేతల ఇళ్లకు ఏసీబీ దాడులు మొదలయ్యాయి.
ఆప్ ఎమ్మెల్యేలకు లంచం ఆఫర్ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ నిజాలు నిగ్గు తేల్చాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాసింది.. బీజేపీ లేఖకు స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీ విచారణకు ఆదేశించారు.
ALSO READ | ఫలితాల వేళ ఢిల్లీలో కీలక పరిణామం.. కేజ్రీవాల్ ఇంటికి 70 మంది ఆప్ అభ్యర్థులు
ఇదిలా ఉండగా.. బుధవారం ( ఫిబ్రవరి 5, 2025 ) జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం ( ఫిబ్రవరి 8, 2025 ) వెలువడనున్నాయి.. ఈ క్రమంలో బీజేపీదే అధికారమంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఈసారి ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.