ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదని ఆప్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తీర్పు వచ్చేదాక ఆగాలని ఆప్ ఈడీని కోరింది. కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు అంశాన్ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 16కి వాయిదా వేసిందని కోర్టులో పెండింగ్ లో ఉండటంతో విచారణకు హాజరుకావడం కుదరదని పార్టీ స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అర్వింద్ కేజ్రీవాల్ ను విచారించాలని ఈడీ అధికారులు ఏడుసార్లు సమాన్లు జారీ చేశారు. లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ కు ఈడీ నాలుగు నెలలుగా నోటిసులు ఇస్తుంది. కానీ కేజ్రీవాల్ ఏడుసార్లలో ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు.
ఫిబ్రవరి 22న కేజ్రీవాల్ కి 7వ సారి ఈడీ నోటీసులు పంపింది. నోటీసుల పై కేజ్రీవాల్ పలుమార్లు స్పందిస్తూ "తనకు నోటిసులు ఇవ్వడం చట్ట విరుద్ధం, రాజకీయ కక్ష సాధింపు, ముందస్తు కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో ఉన్నా, కోర్టు పరిధిలో ఉన్న అంశం" అంటూ వివిధ కారణాలతో ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారు.