జైలులో లొంగిపోయే ముందు హనుమాన్ టెంపుల్ లో కేజ్రీవాల్ పూజలు

 జైలులో లొంగిపోయే ముందు హనుమాన్ టెంపుల్ లో కేజ్రీవాల్ పూజలు

తీహార్ జైలులో లొంగిపోయే ముందు హనుమాన్ టెంపుల్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి,  ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యే క పూజలు నిర్వహించారు. జూన్ 2వ తేదీ ఆదివారంతో కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ ముగిసింది. దీంతో మరికాసేపట్లో  తిహార్ జైలులో ఆయన లొంగిపోనున్నారు. జైలులో లొంగిపోయే ముందు రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు కేజ్రీవాల్.  తన  భార్య సునీతాతో కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ మందిర్‌లో కేజ్రీవాల్ ప్రార్థనలు చేశారు.

లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్ ఇవ్వడంతో.. 21రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. ఆరోగ్య సమస్యలు కారణంగా చూపిస్తూ.. మరో వారంరోజులు బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. దీంతో మరికాసేపట్లో కేజ్రీవాల్ జైలులో లొంగిపోతున్నారు.