
హైదరాబాద్, వెలుగు: హోం అప్లియెన్సెస్ కంపెనీ కెన్‌స్టార్ బీఎల్డీసీ మోటార్‌తో మ్యాక్స్ కూలర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది కరెంటును 60 శాతం వరకు ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. తేమను సమర్థంగా నియంత్రిస్తుందని, ఎక్కువ శబ్దం చేయదని తెలిపింది. ఐదేళ్లో వారంటీతో ఈ కూలర్లు వస్తాయి.
ఇవి ఇండ్లకు, ఆఫీసులకు అనువుగా ఉంటాయని కెన్‌స్టార్ సీఈఓ సునీల్ చెప్పారు. తాము 50 రకాల ఎయిర్ కూలర్లను అమ్ముతున్నామని , వీటిలో పర్సనల్, విండో, డిజర్ట్ కూలర్లు ఉన్నాయన్నారు. నటి రమ్య కృష్ణన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించారు.