
ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్స్ గా రాణించి పెళ్లయిన తర్వాత ఇతర రంగాల్లో సెటిల్ అవ్వడం, కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలో పడటం వంటికారణాలతో ఇండస్ట్రీకి దూరమైన నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు..మలయాళంలో 100కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వెటరన్ హీరోయిన్ శాంతి కృష్ణ ఇప్పటితరం ఆడియన్స్ కి పెద్దగా గుర్తుండకపోయివచ్చు కానీ 90స్ ఆడియన్స్ కి మాత్రం బాగానే గుర్తుంటుంది. ఇటీవలే నటి శాంతి కృష్ణ ఓ ఇంటర్వ్యూ లో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
తాను 16 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చానని దీంతో వచ్చీ రాగానే హీరోయిన్ గా ఆఫర్లు వరించాయని తెలిపింది. అంతా చక్కగా సాగిపోతుందనుకున్న సమయంలో తన మొదటి పెళ్లి జరిగిందని, తన పెళ్లి జరిగే సమాయానికి తన వయసు కేవలం 18 ఏళ్ళు అని చెప్పుకొచ్చింది. అయితే మొదటి పెళ్లి పెటాకులై విడాకులు తీసుకుని మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నానని.. కానీ రెండో పెళ్లి తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని ఎమోషనల్ అయింది. ఇందులో ముఖ్యంగా తాను అనుకున్నట్లు లైఫ్ లీడ్ చెయ్యడానికి తగినంత డబ్బు ఉండేది కాదని, చివరికి తనకి సంబందించిన నిర్ణయాలు కూడా సొంతంగా తీసుకోలేక ఇతరుల చేతిలో తోలు బొమ్మలాగా మారానని ఆవేదన వ్యక్తం చేసింది.
కానీ తన వైవాహిక జీవితంలో తాను ఓడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ తనకి తోడుగా నిలిచిందని చెప్పుకొచ్చింది. విడాకుల అనంతరం ఒంటరితనంతో బాగా ఇబ్బంది పడ్డానని అందుకే మళ్ళీ సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యాయని తెలిపింది. జీవితంలో ప్రేమ, పెళ్లి వంటివి ముఖ్యమే కానీ మహిళలు నిలుదొక్కుకోవాలంటే ఎదో ఒక రంగంలో ప్రావిణ్యం సాధించాలని లేదంటే ఇప్పుడున్న జెనెరేషన్ లో లైఫ్ లీడ్ చెయ్యడం కష్టమని తన అభిప్రాయాన్ని తెలిపింది.
ALSO READ | Puri- Vijay: పూరి జగన్నాథ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్.. విజయ్ సేతుపతికి స్క్రిప్ట్ నచ్చిందా?
ఈ విషయం ఇలా ఉండగా నటి శాంతి కృష్ణ మొదటగా 18 ఏళ్ళ వయసులో మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శ్రీనాథ్ ని 1983లో పెళ్లి చేసుకుంది. ఆ ఆ తర్వాత 1995 లో విడాకులు తీసుకుంది. మళ్ళీ 3 ఏళ్ళ గ్యాప్ లో 1998లో అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త బజోర్ సదాశివన్‌ను వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ మళ్ళీ ఏమైందో ఏమోగానీ 2016లో శాంతి తన రెండవ భర్త సదాశివన్ నుంచి విడిపోయింది.
విడాకుల తర్వాత అమెరికా నుంచి బెంగళూరికి వచ్చింది. ఈ క్రమంలో మలయాళ ప్రముఖ డైరెక్టర్ అల్తాఫ్ సలీం దర్శకత్వంలో వచ్చిన "నందుకలుడే నాటిల్ ఒరిదవేళ" అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించింది. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. దీంతో ఆఫర్లు బాగానే వరిస్తున్నాయి. ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ బాగానే రాణిస్తోంది.