మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్, యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో ఒక పార్లమెంటరీ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల రిజల్ట్స్ వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో ఉంది. ఇక జార్ఖండ్ లో ఇండియా కూటమి,ఎన్డీయే కూటమిలు పోటాపోటీగా లీడ్ లో కొనసాగుతుతున్నాయి.
Also Read :- మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
యూపీలోని 9 అసెంబ్లీ స్థానాల ఫలితాల్లో బీజేపీ కూటమి 6సెగ్మెంట్లలో, మూడింటిలో ఎస్పీ ఆధిక్యంలో ఉంది. మరోవైపు కేరళ బైపోల్స్ రిజల్ట్స్ లో వయనాడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ దూసుకుపోతోంది. ఎల్ డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరీ కంటే 2లక్షల ఓట్లమెజార్టీతో లీడ్ లో ఉన్నారు. కేరళోని చెలక్కర అసెంబ్లీ స్థానం ఓట్ల లెక్కింపులో ఎల్ డీఎఫ్ అభ్యర్థి యూఆర్ ప్రదీప్ లీడ్ లో ఉన్నారు. పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మమ్ కూట్టతిల్ ఆధిక్యంలో ఉన్నారు.