కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ తిరువనంతపురంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. వామనపురంలో స్పీడ్‌గా వెళ్తున్న ఆయన ఎస్కార్ట్కి ముందు బైకర్ ఒక్కసారిగా రైట్ టర్న్ తీసుకున్నాడు. వెనుక ఉన్న ఎస్కార్ట్ ఐదు వాహనాలు సడెన్ బ్రేక్ వేశాయి. దీంతో వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొట్టాయి. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
ALSO READ | అంతా కాపీ పేస్ట్: హీరో విజయ్‌కి డీఎంకే దిమ్మతిరిగే కౌంటర్
ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ కుమార్ క్షేమంగా ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాన్వాయ్‌లోని వెహికల్స్ వరుసగా ఒకదాన్ని ఒకటి డాష్ ఇవ్వడం ట్రాఫిక్ సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ యాక్సిడెంట్ లో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కాన్వాయ్‌లోని కార్లు కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి.
Kerala CM @pinarayivijayan ‘s official car and convoy met with an accident at Vamanapuram. No one was injured pic.twitter.com/b5e6OaW0Bf
— Jisha Surya (@jishasurya) October 28, 2024