అప్పు తీర్చిన రూ.18 కోట్లకు లెక్క చూపించూ : ప్రీతి జింటాకు కేరళ కాంగ్రెస్ కౌంటర్

అప్పు తీర్చిన రూ.18 కోట్లకు లెక్క చూపించూ : ప్రీతి జింటాకు కేరళ కాంగ్రెస్ కౌంటర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీ జింటా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు.. సమాజంలో జరిగే సంఘటనలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. అయితే బీజేపీ ద్వారా "న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా తన రూ.18 కోట్ల రుణాన్ని మాఫీ చేయించుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని నటి ప్రీతి జింటా విమర్శించింది.  

10 ఏళ్ళ క్రితమే తాను ఆ రుణాన్ని తిరిగి చెల్లించానని ఆమె స్పష్టం చేశారు. కేరళ కాంగ్రెస్ పోస్ట్‌పై స్పందిస్తూ, తన పేరును ఉపయోగించి నకిలీ వార్తలు మరియు క్లిక్‌బైట్ వ్యాప్తి చేస్తున్నందుకు ఆ పార్టీని ఆమె విమర్శించారు.

ఇంతకీ ఎం జరిగిందంటే సోమవారం కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ప్రీతీ జింటాని ఉద్దేశిస్తూ "ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బిజెపికి ఇచ్చి 18 కోట్లు రద్దు చేసుకుంది. గత వారం బ్యాంకు కుప్పకూలింది. డిపాజిటర్లు తమ డబ్బు కోసం వీధుల్లో ఉన్నారు". అంటూ ఎక్స్ లో ట్వీట్ చేసింది. దీంతో ప్రీతి జింటా స్పందిస్తూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 

"లేదు, నేను నా సోషల్ మీడియా ఖాతాలను నేనే నిర్వహిస్తున్నాను. నకిలీ వార్తలను ప్రచారం చేసినందుకు సిగ్గుచేటు! ఎవరూ నా కోసం   రుణాన్ని రద్దు చేయలేదు. ఒక రాజకీయ పార్టీ లేదా వారి ప్రతినిధి నకిలీ వార్తలను ప్రచారం చేయడం & నా పేరు & చిత్రాలను ఉపయోగించి నీచమైన గాసిప్ & క్లిక్ ఎరలలో మునిగిపోవడం చూసి నేను షాక్ అయ్యాను" అని రాశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

దీంతో కేరళ కాంగ్రెస్ ప్రీతి జింటా పోస్ట్ కి కౌంటర్ ఇచ్చింది. ఇందులోభాగంగా  "2010కి ముందు, బ్యాంక్ ప్రాధాన్యతా రంగాలకు చిన్న-టికెట్ రుణాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో బ్రాంచ్ మేనేజర్లకు తెలియకుండానే రూ.25 కోట్ల వరకు కార్పొరేట్ రుణాలు మంజూరు చేయబడ్డాయి. ఇంకా, "బాలీవుడ్ నటి ప్రీతి జింటా రూ.18 కోట్ల రుణాన్ని సరైన రికవరీ విధానాలు లేకుండా రద్దు చేశారు. రాజన్‌స్ గ్రూప్ రూ.95 కోట్ల రుణాలు అందుకుందని రిప్లయ్ ఇచ్చింది. అంతేగాకుండా సంబంధిత బ్యాంక్ లో డిపాజిట్ చేసి డబ్బు కోల్పోయిన డిపాజిటర్లకు మేము అండగా నిలుస్తున్నాము. ఒకవేళ మేము షేర్ చేసిన రిపోర్ట్స్ తప్పు అయితే రుణానికి సంబంధించి క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ని షేర్ చేసి డిపాజిటర్లకు అండగా నిలవాలని కోరారు.