Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు

Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మెమోరబుల్ మూమెంట్.. పది కాలాల పాటు అందరూ చెప్పుకునేలా చేసుకోవాలని ప్రతి యువ జంట కోరుకుంటుంది.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేసుకుంటుంది. ఇన్విటేషన్ కార్డులను ప్రత్యేకంగా ప్రింటింగ వేయించడం నుంచి పెళ్లి బరాత్ వరకు ప్రత్యేకంగా అరేంజ్ మెంట్లు చేసుకుంటారు.. ఇదే తరహాలో కేరళకు చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి కార్డును వినూత్న రీతిలో ప్రింట్ చేయించి బంధువులను ఆహ్వానించారు. ఈ కార్డు చూసిన బంధువులు, స్నేహితులతో ఫిదా అయిపోయారు. అంతేకాదు ఇతని పెళ్లి కార్డు ఇప్పుడు నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.. ఇంతకీ ఆ పెళ్లికార్డులో ఏమిటీ స్పెషల్ అంటే.. 

మనం తరుచుగా సోషల్ మీడియాలో వింతవింత పెళ్లి కార్డులను చూశాం. ఆధార్ కార్డ్ మాదిరిగా పెళ్లి ఇన్విటేషన్ కార్డ్, యాపిల్ మ్యాక్‌బుక్‌ లాంటి డిజైన్‌లో పెళ్లి ఇన్విటేషన్ కార్డ్, రీసెర్చ్‌పేపర్‌ లాంటి డిజైన్‌లో పెళ్లి ఇన్విటేషన్ కార్డ్, వెరైటీ వెడ్డింగ్ కార్డ్, వెరైటీ మెసేజ్‌లు ఉన్న పెళ్లి ఇన్విటేషన్ కార్డులు ఇలా అనేక రకాల పెళ్లి కార్డులు వైరల్ అయ్యాయి.. అయితే కేరళకు చెందిన రేషన్ షాపు బాయ్ పెళ్లికార్డు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. 

కేరళలోని పతనం తిట్టకు చెందిన జ్యోతిష్ ఆర్ పిళ్ళై  అనే వరుడు, వధువు దేవికతో తన పెళ్లిఇన్విటేషన్ కార్డును అచ్చు రేషన్ కార్డులా ప్రింట్ చేయించి ఫేమస్ అయిపోయాడు. ఈ కార్డు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్థానిక రేషన్ షాపుతో తన కుటుంబానికి ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తుచేసుకోవడానికి అతను ఇలా చేశాడట. 

కేరళలోని స్థానిక పత్రిక మాతృభూమిలో పిళ్లై పెళ్లి ఇన్విటేషన్ కార్డు ప్రచురించడంతో వైరల్ అయింది. పిళ్ళై ఈ రేషన్ కార్డులా పెళ్లి ఇన్వేటేషన్ కార్డు అచ్చువేయించడం వెనక పెద్ద కథే ఉంది.. తన ముత్తాత కాలంనుంచి రేషన్ షాపు ఉందట పిళ్లై ఫ్యామిలీకి. ముత్తాత తరువాత అతని తండ్రి కె.కె. రవీంద్రన్ పిళ్ళై రేషన్ షాపును నడిపించారు. 2003లో ఆయన మరణించిన తర్వాత జ్యోతిష్ పిళ్లై తల్లి షాపును నడిపిస్తూ పిళ్ళైని పెంచి పెద్ద చేసింది. ఊహ వచ్చినప్పటినుంచి జ్యోతిష్ రేషన్ షాపులో పనిచేశాడు. దీంతో అతనిని రేషన్ షాపు బాయ్ అనేవారు. 

మలయాళంలో ప్రింట్ చేసిన ఈ రేషన్ కార్డు పెళ్లి ఇన్విటేషన్ కార్డులో మ్యారేజ్ కు సంబంధించిన అన్ని వివరాలు రేషన్ కార్డు తరహాలో అచ్చు వేయించారు. ఈ కార్డులో తన కుటుంబ నేపథ్యమంతా ఉంది. ఆహ్వానం ప్రకారం ఫిబ్రవరి 2న వివాహం జరిగింది. ఈ కార్డు ప్రింట్ చేయించిన తీరు చూసి మాతృభూమి పత్రికలో ఓ కథనం రాశారు.. దీంతో ఇది వైరల్ అయింది. ఏదీ ఏమైనా ఒక్క పెళ్లికార్డు వరుడు జ్యోతిష్ సోషల్ మీడియాలో ఫేమ్ చేసింది.