- అనుమానాస్పద స్థితిలో కేరళ కుటుంబం మృతి
- అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన
న్యూయార్క్ : కేరళకు చెందిన ఓ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇద్దరు కవల మగ పిల్లలతో సహా భార్యాభర్తల డెడ్‌బాడీలను వాళ్ల ఇంట్లోనే పోలీసులు గుర్తించారు. కుటుంబ గొడవల కారణంగా పిల్లలను చంపేసి.. దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం శాన్ మాటియోలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
పిల్లలకు విషం పెట్టి చంపి..
కేరళకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ, అతని భార్య అలిస్ ప్రియాంక 9 ఏండ్ల కింద అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వీరికి నాలుగేండ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలున్నారు. రెండుమూడు రోజుల నుంచి వీళ్ల ఇంటి వద్ద ఎలాంటి అలికిడి లేదని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. తెరిచి ఉన్న కిటికీల్లోంచి ఇంట్లోకి వెళ్లగా వారికి నలుగురి డెడ్‌బాడీలు కనిపించాయి. ఇద్దరు పిల్లల మృతదేహాలు బెడ్రూంలో
దంపతుల డెడ్‌బాడీలు బాత్రూంలో గుర్తించారు. అజయ్, ప్రియాంక శరీరంపై బులెట్ గాయాలున్నాయని, అక్కడే 90 ఎంఎం పిస్టల్, బులెట్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, విషం ఇచ్చి చంపేసి ఉండొచ్చన్నారు. ఈ జంట మధ్య కొద్దిరోజులుగా విభేదాలున్నట్లు గుర్తించామన్నారు. 2016లో ఆనంద్ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడని
ఇప్పటివరకు మంజూరు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఆనంద్ సుజిత్ హెన్రీ గడిచిన కొన్నేండ్లలో మెటా, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేశాడు. ఈమధ్యే సొంతంగా ఏఐ కంపెనీ పెట్టి, ఇల్లు కూడా కొనుగోలు చేశాడు.